Trending Now
Thursday, January 16, 2025

Buy now

Trending Now

30నుండి గిరిజనులకు పొడుపట్టాలు

హైదరాబాద్ డెస్క్: (అక్షర సవాల్):

ఈ నెల 30వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి జూన్ 30న సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు.

  1. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు.

కాగా ఈ నెల 24 నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాలచేత ఈనెల 30వ తేదికి మార్చవలసి వచ్చింది.

జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడం, అందుకు సంబంధించి నిన్న, ఇవ్వాల జిల్లా కలెక్టర్లకు శిక్షణా తరగుతులు నిర్వహస్తుండడం, ఈ నెల 29న బక్రీద్ పండుగ వుండడం వంటి కారణాలరీత్యా ప్రకటించిన కార్యక్రమాన్ని జూన్ 30వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.

Related Articles

Latest Articles