Monday, May 27, 2024

ఎంజీఎం హైస్కూల్లో ఘనంగా నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలు

ఎంజీఎం హైస్కూల్లో ఘనంగా నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలు

భూపాలపల్లి, నవంబర్ 14 (అక్షర సవాల్):

గణపురం మండలం చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ లోని ఎంజీఎం హైస్కూల్ యందు భారత దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు నవంబర్ 14వ తేదీన పిల్లల పట్ల ఆయనకు ఉన్న అమితమైన ఇష్టం కారణంగా దేశానికి ప్రధానిగా ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్లినా పిల్లలను ఆప్యాయంగా పలకరించే అతని స్వభావానికి భారత ప్రభుత్వం 1954వ సంవత్సరం నుండి నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుతుంది.అందులో భాగంగా పాఠశాల విద్యార్థిని ,విద్యార్థులు జాతీయ నాయకుల వివిధ వేషధారణల దుస్తులు ధరించి నృత్యాలు, నాటికలు, పాటలు, ఆటలు ప్రదర్శిస్తూ నెహ్రూ బోధనలను, దార్శనికథను ,ఉదాత్త భావాలను గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు, జాతి సంపదలు,విరిసి విరియని కుసుమాలు అని సరైన విద్యతో మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చు.కావున పిల్లలు తల్లిదండ్రుల కలల ప్రతిరూపాలు, భావి భారత పౌరులు వారికి విద్యతోపాటు మంచి విలువలను నేర్పుదాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, గ్యాదంగి రమాదేవి, సిలువేరు శ్రీనివాస్ ,ప్రిన్సిపల్ మధుకర్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles