టీఎస్.జే.యు.రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పావుశెట్టి శ్రీనివాస్ నియామకం
భూపాలపల్లి, ఆగస్టు07 అక్షర సవాల్: ఎన్.యూ.జే(ఐ) అనుబంధం తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ (టి.ఎస్.జే.యూ) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా భూపాలపల్లి కి చెందిన స్టాఫ్ రిపోర్టర్ పావుశెట్టి శ్రీనివాస్ ను నియమిస్తూ టి.ఎస్. జే.యూ రాష్ట్ర అధ్యక్షులు మేరుగు చంద్రమోహన్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జర్నలిజానికి చేసిన విశేషమైన కృషికి,వృత్తి విలువలు, సూత్రాలను నిలబెట్టడంలో అచంచలమైన నిబద్ధతకు గుర్తింపుగా ఈ పదవి బాధ్యత్తులు అప్పగిస్తున్నట్లు వారు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్బంగా పావుశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తన పై నమ్మకం తో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించినందుకు ఎన్.యు.జె (ఐ )జాతీయ ఉపాధ్యక్షులు నారగాని పురుషోత్తం, టీఎస్.జే.యు. రాష్ట్ర అధ్యక్షులు మెరుగు చంద్రమోహన్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు అలాగే తన నియామకానికి సహకరించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,జిల్లా ఉపాధ్యక్షులు నాగపురి శ్రీనివాస్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి జల్ది రమేష్,మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ఉదయ్,రాష్ట్ర నాయకులు సత్యం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని,తెలంగాణలోని జర్నలిస్టులందరికీ మద్దతు ఇచ్చే టీ.ఎస్.జే.యు సంఘాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తానని పావుశెట్టి శ్రీనివాస్ ప్రకటనలో పేర్కొన్నారు.