పెట్రోల్ సుమారు రూ 3.39 లు
డీజిల్ సుమారు రూ 3.27 పెంపు
ప్రాంతాలను బట్టి ధరలలో మార్పులు
సామాన్య ప్రజలపై అదనపు భారం
ములుగు/మంగపేట, మే15, అక్షర సవాల్: ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. పెట్రోల్ సుమారు రూ 3.39 లు, డీజిల్ రూ 3.27 సుమారు అంచనా పెరిగిన ధరలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడనుంది. రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.



