[pj-news-ticker]
Saturday, June 6, 2026

Buy now

త్వరలో ములుగుకు రింగ్ రోడ్డు

త్వరలో ములుగుకు రింగ్ రోడ్డు

 

మంత్రి సీతక్క కీలక ప్రకటన

ములుగు, జూన్ 06, అక్షర సవాల్:

ములుగు పట్టణ ప్రజలకు త్వరలోనే లారీల రద్దీ, ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి కలగనుంది. పట్టణంలో లారీల రాకపోకల వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు వీలుగా రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రస్తుతం ప్రాథమిక రూట్‌ను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. యూనివర్సిటీ పక్క నుంచి మొదలై మదన్‌పల్లి మీదుగా కాసిందేవిపేట, దేవగిరిపట్నం వైపు వెళ్లే మార్గాన్ని పరిశీలనలో ఉంచినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ “రైతుల భూములకు” ఎలాంటి నష్టం వాటిల్లకుండా అదే సమయంలో పట్టణానికి వీలైనంత సమీపంలోనే ఈ రింగ్ రోడ్డు ఉండేలా పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నాం అని స్పష్టం చేశారు.

Related Articles

Latest Articles