[pj-news-ticker]
Thursday, July 2, 2026

Buy now

లారీల జాప్యం ఆగ్రహించిన అన్నదాతలు

లారీల జాప్యం ఆగ్రహించిన అన్నదాతలు

రోడ్డుపై బైఠాయింపు

వాహనాల రాకపోకలకు అంతరాయం

రంగంలోకి దిగిన పోలీసులు

మంగపేట, మే17, అక్షర సవాల్:

ధాన్యం కొనుగోళ్లు లారీల జాప్యంపై ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన ఘటన ఆదివారం మండలంలోని కమలాపురం ములుగు జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది.రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి అన్నదాతల ఆగ్రహానికి అడ్డుకట్ట వేసి రాస్తారోకోను విరమింపచేసి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూశారు. రైతన్నలు ఆగ్రహించి రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకోలు చేయడానికి గల కారణాలను మంగపేట ఏఎస్ఐ శ్రీకాంత్ స్థానిక రైతులను అడిగి తెలుసుకుని సమస్యకు తగు పరిష్కారం చూపడంతో అంతా సద్దుమణిగింది.రోడ్డుపై బైఠాయించిన రైతులు

Related Articles

Latest Articles