తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఆవిర్భావం
హైదరాబాద్ అక్షర సవాల్:
కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు పార్టీ పేరును”తెలంగాణ రాష్ట్ర సేన” (టీఆర్‌ఎస్)గా వెల్లడిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశారు. పార్టీ ఆవిష్కరణ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఇది తన జీవితంలో మరిచిపోలేని రోజు అని అన్నారు. తెలంగాణ కోసం అనేక కష్టాలు పడి, పిడికిలి బిగించి పోరాడామని గుర్తుచేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని పేర్కొన్నారు. ఏ కలలతో తెలంగాణను సాధించుకున్నామో, ఆ ఆకాంక్షలు నెరవేరలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం ప్రారంభమైన రథ చక్రం విరిగి ముక్కలైందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆశయాలను నెరవేర్చే లక్ష్యంతోనే “తెలంగాణ రాష్ట్ర సేన”ను ప్రారంభించినట్లు కవిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల కోసం నిజమైన ప్రాంతీయ రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని ఆమె తెలిపారు.

