Trending Now
Trending Now

మైనర్ బాలికపై అత్యాచారం, మరియు బెదిరింపులకు దిగిన వ్యక్తి కి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారం, మరియు బెదిరింపులకు దిగిన వ్యక్తి కి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష

భూపాలపల్లి, అక్టోబర్ 16(అక్షర సవాల్):

మైనర్ బాలికపై అత్యాచారం మరియు బెదిరింపులకు దిగిన వ్యక్తికి 20 సంవత్సరాల కఠిన జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ పొక్సో స్పెషల్ జడ్జి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నారాయణ బాబు సోమవారం తీర్పు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే…..జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన కీర్తి నరేష్ అనే యువకుడు, ఘనపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై 1-9-2022 రోజున అత్యాచారం, మరియు మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ సెల్ఫీ ఫోటోలు దిగి, బ్లాక్ మెయిల్ చేసి, చాటింగ్ చేయాలని వేధిస్తూ, లేనిచో నిoదితుడితో దిగిన ఫోటోలను యూట్యూబ్ వాట్సాప్ లో పెడతానని భయభ్రాంతులకు గురి చేసి బాలికను శరీరకంగా వాడుకున్నాడని, బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై అభినవ్ కేసు నమోదు చేసి నరేష్ ను రిమాండ్ కు తరలించారు. అనంతరం చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి వెంకట్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి కోర్టులో ఆధారాలను హాజరుపరచగా, బాలిక పై అత్యాచారం, బ్లాక్ మెయిల్ చేసిన యువకుడు కీర్తి నరేష్ కు జిల్లా పొక్సొ స్పెషల్ జడ్జ్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పి నారాయణ బాబు తీర్పు వెలువడించారు. ఈ కేసులో సమర్థ వాదనలు వినిపించిన పిపి విష్ణువర్ధన్ రావు, సాక్షులను బ్రీఫ్ చేసిన చిట్యాల సిఐ వేణు చందర్, గణపురం ఎస్ఐ సాంబమూర్తి, సాక్షులను కోర్టులో హాజరు పరిచన కోర్టు కానిస్టేబుల్ శ్వేతను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అభినందించారు. మహిళలపై నేరాలకు పాల్పడితే చట్టపరంగా శిక్ష తప్పదని ఎస్పి  ఆన్నారు.

Related Articles

Latest Articles