Monday, May 27, 2024

బోనులో చిక్కిన చిరుత

 

న్యూస్ డెస్క్( అక్షర సవాల్):తిరుమల: అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేళ్ల బాలుడిపై గురువారం దాడి చేసిన చిరుత బోనులో చిక్కింది. దాడి అనంతరం అలిపిరి మార్గంలో 150 ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత సంచారాన్ని గమనించిన అటవీ శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు బోన్లను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి 10:45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కినట్లు అధికారులు తెలిపారు. బోనులో చిక్కిన చిరుతను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఒక్క రోజు వ్యవధిలోనే చిరుతను బంధించడంపై భక్తులు టీటీడీ అధికారులను అభినందిస్తున్నారు.

Related Articles

Latest Articles