జులై 1 నుంచి ఆపరేషన్ ముస్కాన్ -9 –
— జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడ్మిన్ ఎస్పి వి. శ్రీనివాసులు
భుపాలపల్లి , జూన్ 28 ( అక్షర సవాల్ ):
తప్పిపోయిన చిన్నారులు, వీధి బాలలు, బాల కార్మికులు, మానవ అక్రమ రవాణాకు గురైన చిన్నారులు, భిక్షాటనలో ఉన్న చిన్నారులను గుర్తించడానికి జూలై 1 నుంచి 31 వరకు నెల రోజులపాటు ఆపరేషన్ ముస్కాన్ -9 స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడ్మిన్ ఎస్పీ వి. శ్రీనివాసులు తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎస్పి అడ్మిన్ శ్రీనివాసులు మాట్లాడుతూ నిస్సహాయ పిల్లల కోసం అంకితభావంతో పనిచేయాలని, పోలీసు శాఖతో పాటు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, సమన్వయంతో పనిచేసి, సత్ఫలితాలు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో
జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగ ఇంఛార్జి ఇన్స్పెక్టర్ వెంకట్, ఎస్సై ఊర్మిళ, CWC సబ్యులు దామోదర్ , డిటి సౌజన్య , డాక్టర్ అన్వేషిని , డిఈవో రాం కుమార్ , సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గాయత్రి, చైల్డ్ లైన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.