Trending Now
Saturday, July 27, 2024

Buy now

Trending Now

యువత చెడు వ్యసనాలకు అలవాటుపడవద్దు : ఎస్సై అభినవ్

యువత చెడు వ్యసనాలకు, అలవాటు పడకూడదని ఉన్నత చదువులు, చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతూ, ఎవరైనా గంజాయి లేదా మత్తు పదార్థాలు తాగిన రవాణా చేసిన పోలీసు వారికి సమాచారం అందించాలని కోరుతూ, ఎవరైనా గంజాయి కేసులో పట్టుబడితే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని గణపురం ఎస్సై మ్యాక అభినవ్ హెచ్చిరించారు.

గంజాయి కేసులో ఇద్దరి పై కేసు  : పోలిసుల తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కేంద్రంలో బుధవారం సాయంత్రం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా పాత ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డు లో అనుమానస్పదంగా స్కూటీపై ఒక వ్యక్తి పోలీసు వారిని చూసి పారిపోతుండగా పోలీసు వారు అతడిని పట్టుకొని విచారించగా సాయి కమల్ అనే వ్యక్తి  సాయి తేజ తో కలిసి గంజాయి సేవిస్తున్నామని తెలిపాడన్నారు. వారిని తనిఖీచేయగా 150 గ్రాములు ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ,నిందితుడి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్, స్కూటీ ద్విచక్ర వాహనం స్వాధీన పరుచుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కోసం పరకాల సబ్ జైలు కి పంపించినట్లు ఎస్సై తెలిపారు.

Related Articles

Latest Articles