Trending Now
Wednesday, October 30, 2024

Buy now

Trending Now

ఆర్టీసీ బస్సుకు తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం

ఆర్టీసీ బస్సుకు తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం

ఆదిలాబాద్ జిల్లా:జూన్ 03(Aksharasaval):
భీంపూర్ మండలంలోని అర్లి -ఇందూర్ పల్లి మార్గంలో ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రహదారి పక్కకు ఒరిగింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.

బస్సు ఆదిలాబాద్ నుంచి కరంజి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా బస్సు అదుపు తప్పిందని ప్రయాణీకులు తెలిపారు.

ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

Latest Articles