మత్తడిపడ్డ మల్లూరు ప్రాజెక్టు
* హర్షం వ్యక్తం చేస్తున్న ఆయుకట్టు రైతులు
మంగపేట, ఆగస్టు 07 ( అక్షర సవాల్ ) : ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు వాగు ( నరసింహసాగర్ ) మద్యతరహా ప్రాజెక్ట్ లోకి పూర్తి సామర్థ్యం మేరకు నీరు చేరుకోవడంతో బుధవారం మత్తడి పడింది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి వరద నీరు వచ్చి ప్రాజెక్ట్ లోకి చేరడంతో ప్రాజెక్ట్ నిండు కుండలా జలకళను సంతరించుకుంది . ప్రాజెక్ పూర్తి స్థాయి నీటి మట్టం 115.25 మీటర్లు కాగా బుధవారంకి నీటి మట్టం 115.30 మీటర్లకు చేరుకోవడంతో మత్తడి పడింది. ప్రాజెక్ట్ లోకి ఎగువ ప్రాంతం నుండి 400 క్యూసెక్కులు ఇన్ ఫ్లో చేరుతుందని నీటిపారుదల శాఖ ఏ.ఈ మహ్మద్ వలీం తెలిపారు. ప్రాజెక్ట్ లోకి పూర్తి సామర్థ్యం మేరకు నీరు చేరుకుని మత్తడి పడడంతో ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువ పరిధిలోని ఆయుకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.