Trending Now
Monday, December 15, 2025

Buy now

Trending Now

బల్దియా ఎదుట ధర్నా నిర్వహిస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు

కార్పొరేషన్ మార్చి 18 (అక్షరసవాల్)): వరంగల్ మహానగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు 26 వేల వేతనాన్ని అందించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.ఉప్పలయ్య డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో పరిశుధ్య కార్మికులు, సిఐటియు అనుబంధ సంఘాల నాయకుల తో కలిసి ధర్నా నిర్వహించారు. 9 డిమాండ్లతో కూడిన మెమొరండాన్ని అదనపు కమిషనర్ జోనాకు అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పలయ్య మాట్లాడుతూ.. మార్చి 19న ప్రవేశపెడుతున్న బడ్జెట్లో 452 పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని 26 వేలకు పెంచే విధంగా బడ్జెట్ రూపొందించాలని, అలాగే బల్దియాలో పాలకవర్గం తీర్మానం చేసినట్లుగా కార్మికులకు 16,600, డ్రైవర్లకు 20,500 వేతనాన్ని ఫిబ్రవరి నుండి అమలు చేయాలని, మండుతున్న ఎండల కారణంగా ఏప్రిల్ ఒకటి నుండి ఒంటి పూట పనులు మాత్రమే చేయించాలని, నూనె, సబ్బులు, సామాగ్రి ఇవ్వాలని, క్యాపులు, భోజనం మజ్జిగ వాటర్ సప్లై చేయాలని ధర్నా నిర్వహించారు. ఏసీ జోన, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి లు డిమాండ్లను తప్పకుండా నెరవేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అనుమకొండ జిల్లా అధ్యక్షులు బరుపట్ల మహేష్, వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను ప్రకాష్, నాయకులు సింగారపు బాబు, యాస బాబు, కృష్ణ, బిక్షపతి, జీవన్, సువర్ణ ,శ్రీలత, రాధిక తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles