ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్డీవో వాహనం
— ఇద్దరి పరిస్థితి విషమం
భూపాలపల్లి, జూలై 23,(అక్షర సవాల్):
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాల – భూపాలపల్లి జాతీయ రహదారి కొంపల్లి క్రాస్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీ నగర్ వైపు నుండి భూపాలపల్లి వైపు వస్తున్న భూపాలపల్లి ఆర్డీవో వాహనం ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై వున్న పిల్లోనిపల్లి కి చెందిన పర్శ సంపత్, కొంపల్లి కి చెందిన సడాలా ఎల్లయ్యకు తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషంగా ఉంది. క్షతగాత్రులని భూపాలపల్లి జిల్లా జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.