Trending Now
Trending Now

30న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిరాహార దీక్ష: అప్పం కిషన్

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 30న నిరాహార దీక్ష

—  వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ పిలుపు.

భుపాలపల్లి , జూన్ 28( అక్షర సవాల్ ):

సింగరేణి కంపెనీలో పనిచేస్తున్న వేలాది మంది మంది కార్మికుల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఈనెల 30వ తారీకు (శుక్రవారం)న భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కార్మిక సమస్యలు పరిష్కారం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని  జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ పిలుపునిచ్చారు.

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ మాట్లాడుతూ.. కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని,సకాలంలో జరగాల్సిన సింగరేణి ఎన్నికల ప్రక్రియ వెంటనే చేపట్టాలని, సింగరేణిలో కారుణ్య నియామకంలో మెడికల్ దందాపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని మారుపేరుతో పని చేస్తున్న కార్మికులకి ఉద్యోగ అవకాశాల్లో వెసులుబాటు కల్పించాలని అన్నారు. యువతకి ఉద్యోగ ఉపాధి కల్పించడం లేదని, భూపాలపల్లి ఇండస్ట్రియల్ ప్రాంతంలో సింగరేణి ఆధారిత పరిశ్రమలను తీసుకో రావడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.  కార్మిక క్వాటర్స్ లలో అసౌకర్యాలని సింగరేణి అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్కృ చేశారు కృష్ణ కాలనీ, సుభాష్ కాలనీ ,కర్మస్ కాలనీలో సింగరేణి ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భూపాలపల్లి జిల్లాలో ఉన్న సింగరేణి కార్మికులు , యువత విజయవంతం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మోహన్, మాధుకర్ రెడ్డి, సుదర్శన్, రమేష్, ప్రశాంత్, కిరణ్, సుధీర్, శేఖర్ దితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles