Trending Now
Trending Now

జిల్లాలో ఏర్పాటు చేయనున్న భరోసా కేంద్రంలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో ఏర్పాటు చేయనున్న భరోసా కేంద్రంలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

-జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి

భూపాలపల్లి, జనవరి 24(అక్షర సవాల్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రంలో సర్వీస్ రెగ్యులరైజేషన్ హక్కులు లేకుండా కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థిల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే  ఒక ప్రకటనలో తెలిపారు. ఒక సంవత్సరం కాలవ్యవధి కొరకు ఒక కౌన్సిలర్, ఇద్దరు సపోర్ట్ పర్సన్, ఒక లీగల్ సపోర్ట్ అధికారి, ఒక రిసెప్షనిస్ట్, ఒక మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఏఎన్ఎం)  ఉద్యోగ నియామకాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు.  కౌన్సిలర్ ఉద్యోగానికి ఎం.ఎస్సీ సైకాలజీ లేదా ఎం.ఏ సైకాలజీ లేదా ఎం.ఎస్.డబ్ల్యూ విద్యా అర్హతలు కలిగి ఉండాలి.సపోర్ట్ పర్సన్ ఆఫీసర్ ఉద్యోగానికి – ఎం.ఎస్.డబ్ల్యూ లేదా చైల్డ్ డెవలప్మెంట్ లేదా సైకాలజీ విభాగం లో మాస్టర్స్ పూర్తి చేసి ఉండాలి.లీగల్ సపోర్ట్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎల్.ఎల్.బి లేదా ఎల్.ఎల్.యం (LLB/LLM) పూర్తి చేసి ఉండాలి.రిసెప్షనిస్ట్ ఉద్యోగానికి  గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మరియు కంప్యూటర్ లిటరేట్ అయి ఉండాలి. లేదా మరేదైనా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్(ANM) ఉద్యోగానికి బి.ఎస్.సి. నర్సింగ్ లేదా GNM (జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరి) లేదా ANM (సహాయక నర్సు మరియు మిడ్‌వైఫ్) విద్యా అర్హత కలిగి ఉండాలి.కౌన్సిలర్ ఉద్యోగానికి రూ.30వేలు,సపోర్ట్ పర్సన్ ఆఫీసర్ ఉద్యోగానికి 20 వేలు,లీగల్ సపోర్ట్ ఆఫీసర్ కు రూ.22వేలు,రిసెప్షనిస్ట్ ఉద్యోగానికి రూ.15వేలు,మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్(ANM) ఉద్యోగానికి రూ.16వేలు గౌరవ వేతనం చెల్లించనుండగా నియామకం మొత్తం తెలంగాణ రాష్ట్ర మహిళ భద్రతా విభాగం ద్వారా జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థినులు తమ బయోడేటా, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, అనుభవం సర్టిఫికెట్స్ ను https://womensafetywing.telangana.gov.in/careers/ వెబ్ సైటు ద్వారా ఈ నెల 31 వ తేది లోపు దరఖాస్తులు పంపించాలన్నారు. దరఖాస్తు విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే షీ టీమ్, భరోసా సెంటర్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ 87126 58162 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.

Related Articles

Latest Articles