[pj-news-ticker]
Tuesday, May 5, 2026

Buy now

గుండెపాక ప్రభాకర్‌ కు దళిత రత్న పురస్కారం

గుండెపాక ప్రభాకర్‌ కు దళిత రత్న పురస్కారం

రవీంద్రభారతిలో దళిత రత్న అవార్డుల ప్రదానం

నెక్కొండ, మే 5 అక్షర సవాల్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్,డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా మహనీయుల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో దళిత రత్న అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. దళితుల అభ్యున్నతి,హక్కుల సాధనలో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖులను గుర్తించి ఈ పురస్కారాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో నెక్కొండ పట్టణానికి చెందిన గుండెపాక ప్రభాకర్ (టీపీసీసీ రాష్ట్ర సంయుక్త సమన్వయకర్త,ఎస్సీ విభాగం) దళిత రత్న అవార్డుకు ఎంపికై ఘన సత్కారం అందుకున్నారు. దళితుల హక్కుల కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ గౌరవం దక్కినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా గుండెపాక ప్రభాకర్ మాట్లాడుతూ,తన సేవలను గుర్తించి ఈ అవార్డుతో సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని,భవిష్యత్తులో కూడా దళితుల సంక్షేమం కోసం మరింత కట్టుబాటుతో పనిచేస్తానని తెలిపారు.అవార్డును అందజేసిన ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఉత్సవాల కమిటీ ఉపాధ్యక్షురాలు మేతరి రోజారాణి,రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం,మేడ్చల్ జిల్లా ఎస్సీ విభాగం చైర్మన్ పత్తి కుమార్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు,సామాజిక కార్యకర్తలు, వివిధ వర్గాల నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles