[pj-news-ticker]
Tuesday, April 14, 2026

Buy now

ప్రజల నీటి దాహార్తిని తీర్చిన మంత్రి సీతక్క

ప్రజల నీటి దాహార్తిని తీర్చిన మంత్రి సీతక్క

ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా

కృతజ్ఞతలు తెలిపిన గ్రామ ప్రజలు

మంగపేట/ఏటూరునాగారం,ఏప్రిల్ 14, అక్షర సవాల్: వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల నీటి దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క కృషి చేస్తుంది. ఏటూరునాగారం మండలం గంటలకుంట, మామిడిగూడెం గ్రామాల్లోని ప్రజలు మురుగునీటినే తాగునీరుగా  వాడుతున్నారనే అంశంపై స్పందించిన మంత్రి సీతక్క వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి  ఆదేశాలతో మంగళవారం కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గుండ్ల దేవేందర్ వాటర్ ట్యాంకర్ల ద్వారా ఆయా గ్రామాలకు త్రాగునీటి సరఫరాను ట్యాంకర్ల ద్వారా ప్రారంభించారు నీటి కొరత లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని అవసరమైతే మంత్రి తన సొంత ఖర్చులతో బోర్లు వేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

Latest Articles