Trending Now
Trending Now

బాధితులకు అండగా భరోసా సెంటర్ : ఎస్పి 

బాధితులకు అండగా భరోసా సెంటర్ : ఎస్పి 

భూపాలపల్లి, ఫిబ్రవరి 17(అక్షర సవాల్):

బాధిత మహిళలు బాలలు అధైర్య పడకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా భరోసా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు దీనిలో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ను ప్రారంభించుకున్నామని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. భరోసా కేంద్రాన్ని జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలోని సింగరేణి భవనంలో ఏర్పాటు చేయడం చేయడం జరిగింది. నేటి నుంచి బాధిత మహిళలకు, బాలలకు ఈ కేంద్రం అన్ని రకాలుగా సహయకారిగా ఉంటుందని లైంగిక వేధింపులకు గురైన మహిళలకు, బాలలకు ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ల కు దూరంగా ఒక మంచి వాతావరణంలో వైద్యాన్ని, న్యాయ సహాయం, కౌన్సిలింగ్ వివిధ రకాలైన అన్ని సౌకర్యాలు ఒకే గొడుగు కింద అందించడం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్స్ సేఫ్టీవింగ్ పర్యవేక్షణలో షీ టీమ్స్, భరోసా కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. మహిళలు బాలలపై నమోదైన కేసుల్లో కేసు నమోదు తర్వాత నుండి విచారణ పూర్తయి, కోర్టులో చార్జి చార్జిషీట్ సమర్పించే వరకు, బాధితులకు అన్ని రకాల సపోర్ట్ ఈ భరోసా కేంద్రం ద్వారా అందించడం జరుగుతుందనీ, ఎస్పి  పేర్కొన్నారు. మోసపోయిన బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మనోధైర్యాన్ని పెంచి, మళ్లీ వంచనకు గురి కాకుండా చూడటం తిరిగి స్వేచ్ఛ జీవితాన్ని కల్పించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఫోక్సో, రేప్, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కు సంబంధించి కేసులలో బాధితులకు సత్వర న్యాయం చేయడం కోసం ఆయా కేసులను భరోసా సెంటర్ కి బదిలీ చేయడం ద్వారా, మెడికల్ ఎగ్జామినేషన్ బాధితుల వాంగ్మూలం నమోదు, బాధితురాలికి మానసిక దృఢత్వానికి కౌన్సిలింగ్ ఇప్పించడం, బాధితురాలు స్టేట్మెంట్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నమోదు చేయడం, బాధితురాలికి పునరావాసం ఇవ్వడం వంటి పనులు జరుగుతున్నాయని అన్నారు. బాధితులు నిర్భయంగా ఉండవచ్చని సూచించారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు ఎస్పి కిరణ్ ఖరే తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ ఏ. నరేష్ కుమార్, భూపాలపల్లి, కాటారం, వర్టికల్ డిఎస్పీలు ఏ. సంపత్ రావు, జి. రామ్మోహన్ రెడ్డి, నారాయణ నాయక్, భరోసా సెంటర్ ఇన్చార్జి సీఐ అజయ్ కుమార్, జిల్లా పరిధిలోని సిఐలు ఎస్సైలు, భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Latest Articles