Trending Now
Saturday, July 27, 2024

Buy now

Trending Now

ఏజెన్సీలో కొత్త దందా…! డబుల్ రేట్ కు మిర్చి విత్తనాలు

ఏజెన్సీలో కొత్త దందా…!
–డబుల్ రేట్ కు మిర్చి విత్తనాల
–బ్లాక్ మార్కెట్లో విక్రయాలు
–నోరు మెదపని అధికారులు
–ఆందోళనలో చిన్న సన్నకారు రైతులు
వాజేడు జూన్ 28 (అక్షర సవాల్):
మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలో కొత్త దందా కొనసాగుతుంది. మిర్చి విత్తనాలను బ్లాక్ చేసి డబుల్ రేట్ కు విక్రయిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు. బ్లాక్ మార్కెట్లో మిర్చి విత్తనాల విక్రయాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు నోరు మెదపకపోవడం వెనకాల ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో నెలకొంది.చిన్న సన్నకారు రైతులకు మిర్చి విత్తనాలు దొరకక ఆవేదన చెందుతున్న కథనమిది…?

గత ఏడాది మిర్చి పంటకు మంచి ధర పలకడంతో దానిని పసిగట్టిన మిర్చి విత్తనాల డిస్ట్రిబ్యూటర్లు ఈ ఏడాది ముందుగానే మిర్చి విత్తనాలను బ్లాక్ చేసి అధిక రేట్లకు అమ్మకాలు జరుపుతున్నారు. 5000 లనుండి 6000 వరకు ఉన్న 341 మిర్చి విత్తనాల రేటును డబుల్ చేసి 12 వేల రూపాయలకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు సమాచారం అది కూడా చిన్న సన్నకారు రైతులకు కాకుండా రాజకీయ నేతలకు పలుకుబడి ఉన్న వ్యక్తులకు ప్రజాప్రతినిధులకు బడా భూస్వాములకు కేజీల కొద్ది ఇస్తూ చిన్న సన్న కారు రైతులకు మాత్రం 341 విత్తనాలు ఇవ్వడంలేదని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మిర్చి విత్తనాలను బ్లాక్ చేసి కోట్ల రూపాయల్లో దందా కొనసాగిస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరతని రీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఇంత జరుగుతున్న సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పక్క జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల దుమ్ముగూడెం మండలాలలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అక్కడి అధికారులు ఆధార్ కార్డు ఆధారంగా చిన్న సన్న కారు రైతులందరికీ విత్తనాలు అందే విధంగా చర్యలు చేపట్టారు కానీ ఇక్కడ మాత్రం అదేమీ జరగడం లేదు పలుకుబడి ఉన్న వ్యక్తులకు బడా భూసాములకు ప్రజా ప్రతినిధులకు కేజీల కొద్దీ విత్తనాలు ఎలాంటి రిసిప్ట్లు లేకుండా విక్రయాలు జరుపుతున్నారు. చిన్న సన్నకారు రైతులకు మాత్రం విత్తనాలు అందకుండాచేసి అన్యాయం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ టు మహారాష్ట్ర:
తెలంగాణ ప్రాంతంలోని మిర్చి విత్తనాల డిస్ట్రిబ్యూటర్లు. 3 4 1 విత్తనాలను మహారాష్ట్ర ప్రాంతానికి తరలించి ముందస్తుగానే విక్రయించడంతో తెలంగాణ ప్రాంతంలో 341 విత్తనాల కొరత ఏర్పడినట్లు సమాచారం మహారాష్ట్ర ప్రాంతంలో అధిక ధరలకు విక్రయించి కోట్లాది రూపాయల సంపదను అర్జించారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుండి మహారాష్ట్ర ప్రాంతానికి విత్తనాలు తరలించి అక్రమంగా విక్రయాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు చలనం లేకపోవడం ఈ ప్రాంత రైతులు దురదృష్టకరంగా భావిస్తున్నారు నిఘా నిద్రపోయి అధికారుల పర్యవేక్షణ కొరవడంతో తెలంగాణ ప్రాంత రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

341విత్తనాలు బ్లాక్ చేసి వేరే విత్తనాలు అంటగడుతున్నారు:
341 విత్తనాలు బ్లాక్ చేసి వేరే విత్తనాలు అంటగడుతున్నారని చిన్న సన్న కారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 100, 2వందలు, 3వందల గ్రాముల విత్తనాలు కూడా దొరకని పరిస్థితి వాజేడు మండలంలో ఏర్పడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు వేరే విత్తనాలు కొనాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి బ్లాక్ మార్కెట్లో ఉన్న 341 విత్తనాలు చిన్న సన్న కారు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ ప్రాంత రైతాంగం ముక్తకంఠంతో కోరుతున్నారు.

Related Articles

Latest Articles