[pj-news-ticker]
Monday, June 1, 2026

Buy now

తిరుమల తిరుపతిలో పెరిగిన భక్తుల రద్దీ

 

తిరుమల తిరుపతిలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :జూన్ 03( Aksharasaval): 
తిరుమల తిరుపతి దేవస్థా నంలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంక న్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

ఈక్రమంలో టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వద ర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

ఇక రూ.300 ప్రత్యేక దర్శ నానికి సుమారు 3 గంటల సమయంపడుతోంది.ఆదివారం శ్రీవారిని 83,740 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ఇక, స్వామివారికి 35,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు…

Related Articles

Latest Articles