[pj-news-ticker]
Friday, April 17, 2026

Buy now

మున్సిపాలిటీ మహిళా కార్మికులకు ఘన సన్మానం 

మున్సిపాలిటీ మహిళా కార్మికులకు ఘన సన్మానం 

హన్మకొండ, మార్చి 08 అక్షర సవాల్:

నగర పారిశుభ్రతలో ప్రతిరోజూ కష్టపడే మున్సిపాలిటీ మహిళా కార్మికులను సైకిల్ వాకర్స్ అసోసియేషన్ (వరంగల్ జిల్లా 303) అధ్యక్షులు వాకర్ జంగ గోపాల్ రెడ్డి ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కిషన్‌పురలో మహిళా కార్మికులను అభినందిస్తూ, వారి సేవలకు గుర్తింపునిచ్చారు. జంగ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, “మహిళలను కేవలం ఏడాదికి ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజూ గౌరవించుకోవాలి. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. వారికి సరైన హక్కులు కల్పిస్తూ రక్షణగా నిలవడం సమాజ బాధ్యత. ముఖ్యంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళా కార్మికులు చూపిస్తున్న కృషిని గుర్తించి సన్మానించడం గర్వకారణం” అని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి పి. అనంత్, కోశాధికారి పి. రమేష్, సహాయ కార్యదర్శులు సత్యనారాయణ, లక్ష్మయ్య, జయప్రసాద్, రవి, కాలనీ వాసులు, జవాన్లు సునిత, బాబు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles