[pj-news-ticker]
Friday, April 17, 2026

Buy now

భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గా నరేష్ కుమార్

భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గా ఏ. నరేష్ కుమార్

భూపాలపల్లి, డిసెంబర్ 14(అక్షర సవాల్):

జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా ఏ. నరేష్ కుమార్,గురువారం  పదవి బాధ్యతలు స్వీకరించారు. పోలిసు శాఖలో 1991 సంవత్సరంలో ఎస్సైగా ఎంపికయిన అదనపు ఎస్పీ నరేష్ కుమార్, మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్,రాయకల్ , కోరుట్ల, వేములవాడ, కరీంనగర్ రూరల్ లో ఎస్సైగా విధులు నిర్వహించి, 2006 లో సీఐగా పదోన్నతి పొంది సీఐడి వరంగల్, టేకులపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, జగిత్యాల, ఖానాపూర్ సీఐ గా విధులు నిర్వర్తిస్తూ, 2017 లో డిఎస్పీ గా పదోన్నతి పొంది  మహబూబాబాద్, మామునూర్ ఏసిపి గా విధులు నిర్వర్తిస్తూ, 2023 లో అదనపు ఎస్పిగా ప్రమోషన్ పొంది , సీఐడి వరంగల్ అదనపు ఎస్పీగా పనిచేస్తూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గా బదిలీపై రావడం జరిగింది. అదనపు ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన ఏ. నరేష్ కుమార్ కు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Latest Articles