నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల ముగింపు
మంచిర్యాల, Jun 03 (Aksharasaval):
నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల ముగింపు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఉదయం 10 గంటలకు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆయన కోరారు.

