స్వాతంత్ర్య సమరయోధుల సేవలు చిరస్మణీయం : ఎస్పి
భూపాలపల్లి, ఆగస్టు 15(అక్షర సవాల్):
స్వాతంత్ర్య సమరయోధుల సేవలు చిరస్మరణీయం అని, వారి త్యాగాలతో ఏర్పడ్డ దేశంలో నేడు ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతున్నారని, స్వయం పాలనలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ఎస్పి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ జిల్లా ప్రజలకు , పోలిసు అధికారులు, సిబ్బందికి, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. మాతృ భూమి కోసం ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారని అన్నారు.స్వాతంత్ర్య దినోత్సవం, వంటి జాతీయ పండుగలు మనం సమాజానికి ఏవిధంగా సేవచేయాలని మన విధులను గుర్తు చేస్తాయని అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నిజాయతీగా పూర్తి బాధ్యతతో పని చెయ్యాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే సామాన్యులకు న్యాయం చేయాలన్నారు. జిల్లాను డ్రగ్ ఫ్రీ మార్చేందుకు పనిచేయాలని, అభివృద్ధి జరగాలంటే భద్రత ముఖ్యమని, శాంతి భద్రతల పరిరక్షణ లో జిల్లా పోలిసులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు, డిపిఓ ఏఓ వసిం ఫర్హాన, సూపరింటెడేoట్ సతీష్, ఇన్స్పెక్టర్లు వసంత్ కుమార్ నరేష్ కుమార్, రత్నం, రామచంద్రరావు, మల్లేష్, పోలిసు అధికారులు, సిబ్బంది, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.