[pj-news-ticker]
Monday, May 25, 2026

Buy now

సీసీ రోడ్డుతో రాంపురం అభివృద్ధికి కొత్త దారి

సీసీ రోడ్డుతో రాంపురం అభివృద్ధికి కొత్త దారి

గ్రామ ప్రజల చిరకాల స్వప్నం సాకారం చేసిన సర్పంచ్ భరత్ కుమార్

గీసుగొండ, అక్షర సవాల్: రాంపురం గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును నేడు ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ రడం భరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, నాయకులు భారీగా హాజరై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రడం భరత్ కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఎన్నో రోజుల ఆకాంక్ష అయిన సీసీ రోడ్డు నిర్మాణం పూర్తికావడం ఆనందంగా ఉందన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అన్ని వీధుల్లో దశలవారీగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడతామని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పులి సూరయ్య, వార్డు సభ్యులు దర్శనాల రచన, తాబేటి సునీత, బొమ్మగాని లక్ష్మి, గాజర్ల శీను, మాజీ సర్పంచ్ గాజర్ల గోపి, మాజీ ఉప సర్పంచ్ దర్శనాల కుమారస్వామి, నాయకులు మర్రిడ్డి గజ్జి రవి, దర్శనాల రాజుతో పాటు గ్రామ యువకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న సర్పంచ్ రడం భరత్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నూతన సీసీ రోడ్డుతో గ్రామంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని హర్షం వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles