సర్వాయి పాపన్న గౌడు జయంతి వేడుకలను విజయవంతం చేయండి
మంగపేట, ఆగస్టు 17 ( అక్షర సవాల్ ) : ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో రేపు ( ఆదివారం ) నిర్వహించనున్న గౌడుల ఆరాధ్య దైవం సర్వాయి పాపన్న గౌడు జయంతి వేడుకలను విజయవంతం చేయాలని ఏజెన్సీ గౌడు హక్కుల సంఘం మంగపేట మండల అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన మంగపేటలో శనివారం ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో రావుల శ్రీనివాస్ గౌడు మాట్లాడుతూ సామాజిక స్పృహను తట్టి లేపి సమాజం కోసం పాటుపడిన, ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు అని అన్నారు. అట్టి మహానుభావుడి జయంతి ఉత్సవాలను మంగపేట మండల కేంద్రంలో ఆదివారం నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాలకు మండల పరిధిలోని గౌడులందరూ హాజరై విజయవంతం చేయాలని అన్నారు.