రోడ్డుపై గుంతలు పూడ్చిన పోలీసులు
మంగపేట, ఆగస్ట్ 04 ( అక్షర సవాల్ ) : ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం మంగపేట గ్రామాల మద్య దొంగల ఒర్రె వద్ద ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గుంతలు పడటంతో రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారు. ఈ విషయంపై మంగపేట ఎస్సై టీవీఆర్ సూరి స్పందించారు. ఎస్సై టీవీఆర్ సూరి ఆదివారం కమలాపురం గ్రామ పంచాయతి కార్యదర్శి అరుణ్ తో కలిసి ట్రాక్టర్ల ద్వారా ఎర్రమట్టి తెప్పించి గుంతలు పడిన చోట రోడ్డుపై మట్టి పోసి గుంతలను పూడ్చారు. రోడ్డుపై గుంతలను పూడ్పించిన ఎస్సై టీవీఆర్ సూరిని వాహనదారులు, స్థానికులు అభినందిస్తున్నారు. ఎస్సై టీవీఆర్ సూరి సామాజిక స్పూర్తికి ప్రజలు సెల్యూట్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.