మానవత్వం చాటుకున్న బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి
గణపురం ,అక్టోబర్ 15 (అక్షర సవాల్):
విద్యుత్ షాప్ కి గురైన కిరణ్ ని తన సొంత ఖర్చుతో హాస్పిటల్ కి తరలించి మానవత్వం చాటుకున్న బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి. వివరాల్లోకి వెళ్తే… మండలంలోని వెల్తుర్లపల్లి – కొండాపూర్ గ్రామ మధ్య లోని మూరంచ బ్రిడ్జి వద్ద విద్యుత్ మరమస్తులు చేస్తుండగా విద్యుత్ షాక్ కి గురైన కిరణ్ ని అటు వైపు నుండి మండల కేంద్రానికి వస్తున్న బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి తక్షణమే స్పందిచి తన స్వంత వాహనం లో గణపురం ప్రాథమిక ఆసుపత్రి కి తరలించారు. మెరుగైన వైద్య చికత్స కోసం తరలించేందుకు 108 అంబులెన్స్ అందుబాటులో లేనందున బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి తన స్వంత కర్చులతో ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడి మెరుగైన చికిస్తకోసం హనుమకొండకు తరలించారు.