తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ…
హైదరాబాద్ డెస్క్,జూలై 14(అక్షర సవాల్):
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఇవ్వాల (శుక్రవారం) జరిగిన బదిలీలకు సంబంధించి సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. బదిలీల్లో 31 మంది ఐఏఎస్ అధికారులున్నారు. ఇందులో ఎంసీఆర్ హెచ్ఆర్డీ డీజీగా శశాంక్ గోయాల్ బదిలీ అయ్యారు. ఇక.. యువజన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా శైలజా రామయ్యర్, ఆయుష్ డైరెక్టర్గా హరిచందన దాసరి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డైరెక్టర్గా వర్షిణి బదిలీ అయ్యారు.స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్గా కుర్రా లక్ష్మి, ఎయిడ్స్ సొసైటీ డైరెక్టర్గా హైమావతి, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీగా కె. హరిత బదిలీ కాగా. కె. స్వర్ణలత జీఏడీకి బదిలీ అయ్యారు. టూరిజం డైరెక్టర్గా కె. నిఖిల, అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్గా సత్య శారదాదేవి, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా ప్రియాంకా, ములుగు కలెక్టర్గా ఇలా త్రిపాఠి, పొల్యూషన్ బోర్డు మెంబర్ సెక్రెటరీగా కృష్ణ ఆదిత్యా, పెద్దపల్లి కలెక్టర్గా ముజామిల్ ఖాన్, టీఎస్ ఫుడ్స్ ఎండీగా సంగీత సత్యనారాయణ, భద్రాద్రి ఐటీడీఏ పీడీగా ప్రతీక్ జైన్, సెర్ఫ్ సీఈవోగా గౌతమ్ పొట్రూ, మహబుబ్నగర్ అడిషనల్ కలెక్టర్గా వెంకటేశ్ దౌత్రే, ఖమ్మం అడిషనల్ కలెక్టర్గా అభిలాష అభినవ్, జీహెచ్ఎంసీ అడిషనల్ కలెక్టర్గా స్నేహ శబరిష్, కామారెడ్డి అడిషనల్ కలెక్టర్గా మను చౌదరి, జగిత్యాల అడిషనల్ కలెక్టర్గా టీఎస్ దివాకర్ బదిలీ అయ్యారు. హైదరాబాద్ కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి, నాగర్కర్నూల్ అడిషనల్ కలెక్టర్గా కుమార్ దీపక్, పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్గా చెక్క ప్రియాంక, కరీంనగర్ అడిషనల్ కలెక్టర్గా అరుణశ్రీ, సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్గా చంద్రశేఖర్, రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్గా ప్రతిమాసింగ్, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్గా గరిమా అగర్వాల్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా మకరందు, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ సెక్రెటరీగా నవీన్ నికోలస్ బదిలీ అయ్యారు. Transfer orders