Monday, May 27, 2024

తెలంగాణ జనగర్జనకు భారీ ఏర్పాట్లు

తెలంగాణ జనగర్జనకు భారీ ఏర్పాట్లు

  • వంద ఎకరాల్లో నిర్వహణకు కసరత్తు
  • పనులు, జనసమీకరణలో నిమగ్నమైన హస్తం శ్రేణులు, పొంగులేటి వర్గీయులు                                               ఖమ్మం జిల్లా :జూన్ 29 ( అక్షర సవాల్ ) : 
    మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన వర్గీయుల చేరిక నేపథ్యంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఖమ్మంలో 2వతేదీన నిర్వహించ తలపెట్టిన సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాహుల్‌గాంధీ రానున్న ఈ సభకు తెలంగాణ జనగర్జన సభగా పేరుపెట్టిన నేతలు.. సభను విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఖమ్మం-వైరా రోడ్డులో ఎస్‌ఆర్‌గార్డెన సమీపంలోని వంద ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి.. యంత్రాలు, ట్రాక్టర్ల సాయంతో చదును చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌ కోసం ఆ స్థలానికి సమీపంలోని మరో 50ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఓ వైపు పార్టీ నేతలు, శ్రేణులతో పాటు త్వరలో పార్టీలో చేరబోయే పొంగులేటి అనుచరులు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు అన్ని జిల్లాల నుంచి 4లక్షల నుంచి 5 లక్షల మంది వరకు జనసమీకరణ చేసి తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. రాహుల్‌గాంధీతోపాటు కర్నాటక డీప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఏఐసీసీ, పీసీసీ నేతలు ఈ సభకు హాజరుకానున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు మరికొందరు ఇతర జిల్లాల నేతలు అదే సభలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండటంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఈసభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున ఈ సభ ఎన్నికల శంఖారావానికి వేదిక కానుందని, రాష్ట్ర కాంగ్రె్‌సలో కొత్త ఉత్సాహాన్ని తెస్తుందని నేతలు ఆశిస్తున్నారు. రాహుల్‌సభ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించబోతున్నామని, 5 లక్షల మంది అంచనాతో సభా ఏర్పాట్లు చేస్తున్నామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తెలంగాణ జనగర్జన పేరిట జరిగే ఈసభతో తెలంగాణలో కాంగ్రె్‌సను ఎన్నికల దిశగా నడిపించేందుకు సిద్ధమవుతున్నామన్నారు.

రేపు ఖమ్మానికి రేవంత్?

టీపీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి గురువారం ఖమ్మం రానున్నారు. 2వతేదీన ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన తెలంగాణ జనగర్జన సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన ఖమ్మం రానున్నారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ, జనసమీకరణ తదితర అంశాలపై చర్చించి సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించున్నారు.

Related Articles

Latest Articles