వాట్సాప్ లో వ్యక్తిగత దూషణ చేసిన వ్యక్తిపై మరియు గ్రూప్ అడ్మిన్ పై కేసు నమోదు : ఎస్సై సాంబమూర్తి
గణపురం, అక్టోబర్ 28(అక్షర సవాల్):
చెల్పూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి అను వ్యక్తి దరఖాస్తు మేరకు అతని పై చెల్పూర్ సమాచార గ్రూప్ అను వాట్సాప్ గ్రూప్ లో వ్యక్తిగత దూషణలు కు సంబందించిన అసబ్య పదజాలం తో కూడిన ఆడియో ను పోస్ట్ చేసినందుకు గాను ఎంజాల సురేష్ మరియు చెల్పూర్ సమాచార గ్రూపు అడ్మిన్ అయినా జెట్టి కనకరాజు అను ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఘన్పూర్ మండలానికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపు లలో ఎవరైనా గానీ వ్యక్తిగత దూషణలు మరియు శాంతి భద్రతలకు విగతం కలిగించే విధంగా మెసేజ్ మరియు ఆడియోలు, వీడియోలు పోస్ట్ చేసినట్లయితే వారి మీద మరియు గ్రూప్ అడ్మిన్ ల పై చట్టరీత్య కఠినమైన చర్యలు తీసుకుంటాము అని మండలం లోని వాట్సాప్ గ్రూప్ ల మీద పోలీస్ వారి ప్రత్యేక మైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అని గణపురం ఎస్సై మచ్చ సాంబమూర్తి తెలుపుతూ వాట్సాప్ లో పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి అని హెచ్చరించారు.