Trending Now
Trending Now

షీటీమ్స్ తో మహిళలకు, బాలికలకు భద్రత, భరోసా : జిల్లా ఎస్పి

షీటీమ్స్ తో మహిళలకు, బాలికలకు భద్రత, భరోసా : భూపాలపల్లి జిల్లా ఎస్పి 

  • విద్యాసంస్థలు, రద్దీ ప్రదేశాల్లో షీటీమ్స్ తో నిరంతరం నిఘా

భూపాలపల్లి, సెప్టెంబర్ 2 (అక్షర సవాల్):

షీటీమ్స్ పోలీసులు మహిళలకు, బాలికలకు భద్రత, భరోసా కల్పిస్తున్నారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  పుల్లా కరుణాకర్ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు జరిగితే ఫిర్యాదు సంబంధిత పోస్టర్లను ఎస్పీ  ఆవిష్కరించడంతో పాటు,ఆగస్ట్ నెలలో షి టీమ్ పోలీసులకు అందిన 6 పిర్యాదుల వివరాలను వెల్లడించారు. 06 పిర్యాదుల్లో ఒకటి -FIR కాగా, 02- ఈ పెట్టి కేసులు నమోదుతో పాటు, ముగ్గురు ఆకతాయులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ..జిల్లాలో ఉన్న షీ టీమ్స్ బృందాలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో,ప్రభుత్వ పాఠశాలల్లో, తెలంగాణ మోడల్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ స్కూల్లలో విద్యార్థిని విద్యార్థులకు షీటీమ్ దాని యొక్క ప్రాముఖ్యత, నిర్వహించే విధుల గురించి, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టాలు, బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి, ఈవ్ టిజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తదితర అంశాలు, సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్ క్రైమ్స్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజ రుగ్మతల గురించి సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి వివరిస్తూ, నిత్యం అవగాహన కల్పిస్తున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభత్వo మహిళలు, బాలికల రక్షణ గురించి ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళలు, బాలికలు, విద్యార్థిని విద్యార్థులకు రక్షణగా నిలుస్తూ సేవలు అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ ప్రత్యేక గుర్తింపు పొందిందని ఎస్పి  తెలిపారు. మహిళలు బాలికలు విద్యార్థినిలు షీటీమ్స్ సేవలు వినియోగించుకోవాలని అలాగే పని ప్రదేశాల్లో లైంగిక వేధిoపులకు ఎవరైనా పాల్పడితే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఎస్పీ కరుణాకర్  పేర్కొన్నారు. విద్యార్థినిలు మహిళలు, మహిళా ఉద్యోగినులు మౌనం విడి ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని, సమస్యలను చెప్పుకున్నప్పుడే మరింత భద్రత కల్పించగలుగుతామని అన్నారు. చదివే విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా విద్యకు దగ్గరగా ఉండి తమ లక్ష్యాలను చేరుకోవాలని, మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని,మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

వేధింపుల గురయ్యే మహిళలు, విద్యార్థినిలు వెంటనే డయల్100 లేదా , జిల్లా షీ టీమ్ నెంబర్ 8712658162 కు పిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రామోజు రమేష్, సిడబ్ల్యుసి చైర్మన్ అనిల్ చందర్ రావు, ఇన్స్పెక్టర్ అజయ్, డిపిఓ ఏవో ఫర్హాన, డిపిఓ సూపర్డెంట్ సోఫియా సుల్తాన, ఎస్ఐలు సంధ్యారాణి, శ్రీలత, సఖి సిఏ గాయత్రి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Latest Articles