తెలంగాణ పోరాట స్ఫూర్తి చాకలి అయిలమ్మ :జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్
భూపాలపల్లి,సెప్టెంబర్ 26(అక్షర సవాల్):
భూమి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం చాకలి అయిలమ్మ(చిట్యాల అయిలమ్మ ) అలుపెరుగని పోరాటo చేశారని, అయిలమ్మ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు స్పూర్తి నింపారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్ అన్నారు.
తెలంగాణ మహిళల చైతన్యానికి , వీరత్వాకి చిట్యాల అయిలమ్మ ప్రతీకగా నిలిచారని ఎస్పి పేర్కొన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయoలో ఎస్పి కరుణాకర్ వీరనారి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సబ్బండ వర్గాలకు, మహిళ చైతన్యానికి ప్రతీకగా నిలిచారని, పేదల తరుపున పెత్తందారులతో పోరాడిన ఐలమ్మ తెలంగాణ మహిళ వీరత్వానికి నిదర్శనం అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి తెలంగాణ సాధనకు తోడ్పాటును అందించిందని వారి ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పి కరుణాకర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పి వి. శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ వసీమ్ ఫర్హనా, జిల్లా పరిధిలోని సీఐ లు, ఎస్సై లు, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.