Trending Now
Trending Now

అభివృద్ధిని అడ్డుకోవద్దు..శ్రమదానం చేసిన ఎమ్మెల్యే సీతక్క

ఫారెస్ట్ అధికారులు అభివృద్ధిని అడ్డుకోవద్దు

  • నిధులు మంజూరైన పనులు జరగడం లేదు
  • తొమ్మిదిన్నర ఏళ్లు గడిచినా రోడ్ల పరిస్థితి మారలేదని
  • కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేసిన ఎమ్మెల్యే సీతక్క

ములుగు, జూన్ 29(అక్షర సవాల్):

ఫారెస్ట్ అధికారులు రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవద్దని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం ములుగు నియోజక వర్గం లోని పాకాల కొత్త గూడ రోడ్డును కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. అనంతరం రోడ్లపై ఏర్పడిన గుంతలను గమనించి శ్రమదానం నిర్వహించి గుంతలను పూడ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజక వర్గం వెనుకబడిన ప్రాంతమని, ముఖ్యంగా కొత్త గూడ , గంగారాం మండలాలకు రోడ్లు మంజూరు జరిగినప్పటికీ ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో టెండర్ పూర్తి చేసుకొని మధ్యలోనే పనులు ఆగిపోయాయని అన్నారు. దీంతో రోడ్లన్నీ గుంతలుగా ఏర్పడి ప్రజా రవాణా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

  • తొమ్మిదిన్నర ఏళ్లు గడిచినా రోడ్ల పరిస్థితి మారలేదు

రాష్ట్రం ఏర్పడి తొమ్మిదిన్నర సంవత్సరాలు గడిచిన రోడ్ల పరిస్థితి ఏమాత్రం మారలేదని మండిపడ్డారు.రోడ్ల మరమ్మత్తుల కోసం,అలాగే నూతన రోడ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు మంజూరు చేపిస్తే ఫారెస్ట్ అధికారులు అనుమతులు లేవని అడ్డుపడడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెనుకబడిన కొత్తగూడ గంగారం మండలాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా, మండల నాయకులు ఎంపీపీ, జెడ్పీటీసీ,ఎం పీటీసీ,సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Related Articles

Latest Articles