ఆగస్టు 9న జిల్లాస్థాయి యువజనోత్సవాన్ని విజయవంతం చేయండి భూపాలపల్లి జిల్లా ఎస్పీ
భూపాలపల్లి,ఆగష్టు 05(అక్షర సవాల్):
నెహ్రు యువ కేంద్ర వరంగల్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సౌజన్యంతో అజాధికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 9 న ఏర్పాటు చేస్తున్న జిల్లాస్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమంలో యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ పిలుపునిచ్చారు. శనివారం, జిల్లా యువజన అధికారి చింతల అన్వేష్ మరియు నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లతో కలిసి ఎస్పీ గోడ పత్రికను ఆవిష్కరించారు.
భారతదేశానికి స్వాతంత్ర సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని, ఆదర్శాలను, విలువలను వ్యాప్తి చేయడానికి, విభిన్న సంస్కృతుల మధ్య ఐక్యతను సాధించేందుకు, జిల్లాస్థాయిలో సాంస్కృతిక, వకృత్వ, పెయింటింగ్, పద్య రచన మరియు మొబైల్ ఫోటోగ్రఫీ అనే 5 రకాల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలు బుధవారం 9-08-2023, శనివారం, రోజున సమయము ఉదయం 9.30 గంటల నుండి ప్రారంభమవుతాయని, యువతి యువకుల వయసు 15 నుండి 29 సంవత్సరాలు లోపు ఉండాలని, ఒక్కరు ఒక్కరూ పోటీలో మాత్రమే పాల్గొనాలని, యంగ్ రైటర్స్ కాంటెస్ట్, యంగ్ పెయింటింగ్ ఆర్టిస్ట్ కంటెస్ట్ మరియు మొబైల్ ఫోటోగ్రఫీ పోటీలకు ప్రధమ నగదు బహుమతి 1,000 రూపాయలు, ద్వితీయ నగదు బహుమతి 750 రూపాయలు, తృతీయ నగదు బహుమతి 500 రూపాయలు కాగా వకృత్వ పోటీ, ప్రథమ నగదు బహుమతిగా 5,000 రూపాయలు, ద్వితీయ నగదు బహుమతి 2,000 రూపాయలు, తృతీయ నగదు బహుమతి 1,000 మరియు డిస్టిక్ కల్చరల్ ఫెస్టివల్ గ్రూప్ ఈవెంట్ పోటీ విజేతలకు ప్రథమ నగదు బహుమతిగా 5,000 రూపాయలు, ద్వితీయ నగదు బహుమతి 2,500 రూపాయలు, తృతీయ నగదు బహుమతి 1,250 రూపాయలు చొప్పున అందజేయ బడుతుందని ఎస్పీ తెలియజేశారు. పై విధంగా వివరింపబడిన అన్ని పోటీలకు అంశం పంచప్రాన్ అమృత్ కాల్ లోని ఐదు అంశాలుగా నిర్ణయించబడింది. డిస్టిక్ కల్చరల్ ఫెస్టివల్ పోటీలో పాల్గొనే బృందాలు జానపద, సంప్రదాయ నృత్య రూపాల్లో మాత్రమే ప్రదర్శనలు ఇవ్వవలసి ఉంటుంది. డిక్లమేషన్ పోటీ హిందీలో గాని ఇంగ్లీషులో గాని ఏడు నిమిషాలు పరిమితితో ఉంటుంది. కవిత రాయటం తెలుగు హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. పై పోటీలలో పాల్గొనదలుచుకున్న సభ్యులు ముందుగానే ఈ క్రింది ఆన్లైన్ లింక్ ద్వారా https://docs.google.com/forms/d/1t1mvN38VcfBmKlo43QkJeWfWNLPbURk1glkXMYIXVWw. రిజిస్ట్రర్ వేసుకోవాలని అన్నారు.
ఒక్కొక్క కాంపిటీషన్లో పరిమితితో కూడిన నిబంధనలు ఉండటం వలన సత్వరమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మరిన్ని వివరాలకు 0870-2958776 ,7287920310, 7013427603 ఫోన్ నెంబర్ లలో కానీ సంప్రదించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన అధికారి చింతల అన్వేష్ పేర్కొన్నారు.