Trending Now
Trending Now

ప్రజలకు న్యాయం చేయాలి : మల్టీ జోన్ ఐజీ 

ప్రజలకు న్యాయం చేయాలి : మల్టీ జోన్ ఐజీ 

– లోక్ సభ ఎన్నికల సందర్భంగా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం

– పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలి

– ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సిబ్బంది సమిష్టిగా విధులు నిర్వహించాలి

– ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలి

– ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి

భూపాలపల్లి, మార్చి 28(అక్షర సవాల్):

ప్రజలకు పోలిసు అధికారులు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని, బాధితులకు న్యాయం జరిగినప్పుడే పోలీసులు ప్రజల మన్నననలు పొందుతారని మల్టీ జోన్ -1 ఐజి ఏ.వి రంగనాథ్ అన్నారు. గురువారం భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పి కిరణ్ ఖరే తో కలిసి పోలిసు అధికారులతో లోక్ సభ ఎన్నికలతో పాటు, నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎస్పి కిరణ్ ఖరే , భూపాలపల్లి జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితి అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గ పరిధి, పోలింగ్ లోకేషన్లు, పోలింగ్ కేంద్రాలు, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, జిల్లాలో ఉన్న ఓటర్లు, ఎన్నికల సందర్భంగా సెక్యూరిటీ ప్లాన్ తదితర అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐజి కి వివరించారు.

అనంతరం ఐజి ఏ.వి రంగనాథ్ మాట్లాడుతూ,లోక్ సభ ఎన్నికల సందర్భంగా పోలిసు అధికారులు, సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించాలని అన్నారు.ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులందరూ సమిష్టిగా సమర్దవంతంగా పనిచేయాలని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని, ఎవరైనా చట్ట వ్యతిరేఖ చర్యలకు దిగితే కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. అలాగే క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అధికారులు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఐజి పేర్కొన్నారు.విధినిర్వహణలోఅలసత్వం వహించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగ్ ఉన్న నాన్ బేలబుల్ వారెంట్స్ వెంటనే ఎగ్జిక్యూట్ చేయాలని, ల్యాండ్ కేసులు, సివిల్ కేసులలో, ఎస్ఓపి ప్రకారం పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు.ఓల్డ్ పెండింగ్ ఉన్న కేసులలో ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తిచేసి త్వరగా డిస్పోజల్ చేయాలన్న ఐజి లాంగ్ పెండింగ్ కేసులపై రివ్యూ నిర్వహించి సంబంధిత అధికారులకు తగు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి, వర్టికల్ డిఎస్పీ నారాయణ నాయక్, జిల్లా పరిధిలోని సీఐలు, నరేష్ కుమార్, మల్లేష్, రాజేశ్వరావు, నాగార్జున రావు, వసంత్ కుమార్, రామకృష్ణ, రవీందర్, రిజర్వు, ఇన్స్పెక్టర్ లు నగేష్, కిరణ్, రత్నం, శ్రీకాంత్, జిల్లా పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles