ఉద్యోగ విరమణ అనేది రెండో ఇన్నింగ్స్: ఎస్పి
భూపాలపల్లి, మార్చి 30(అక్షర సవాల్):
పదవి విరమణ చేసిన ఉద్యోగులు కుటుంబం, బంధు మిత్రులతో కలిసి సుఖ సంతోషాలతో గడపటానికి రెండో ఇన్నింగ్స్ అవకాశంగా భావించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన ఏఅర్ హెడ్ కానిస్టేబుళ్లు నారాయణ రెడ్డి, వెంకటయ్య, గోపాల్ రెడ్డిలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు పలికి, వారిని ఘనంగా సన్మానించి, వారి కుటుంసభ్యులకు గృహోపకరణాలు అందించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ దాదాపు 38 ఏళ్లుగా విధి నిర్వహణలో అహర్నిశలు శ్రమించి,ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమని, రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులను ప్రణాళిక బద్దంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఏ అవసరం వచ్చినా పోలీస్ శాఖ తరపున తమవంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ వేముల శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్, శ్రీకాంత్, కిరణ్, జిల్లా పోలీసు అధికారుల సంఘం నేత మర్కాల యాదిరెడ్డి, పదవీ విరమణ చేసిన హెడ్ కానిస్టేబుళ్ళ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.