Trending Now
Monday, December 15, 2025

Buy now

Trending Now

జయశంకర్ జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పి కిరణ్ ఖరే ఐపీఎస్ 

జయశంకర్ జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పి కిరణ్ ఖరే ఐపీఎస్ 

భూపాలపల్లి, నవంబర్ 3 (అక్షర సవాల్):

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నేటి నుంచి ఈనెల 30 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కిరణ్ ఖరే ఐపీఎస్  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు యాక్ట్ ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పి  తెలిపినారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పి  సూచించారు. కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణ కు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని కోరారు.

Related Articles

Latest Articles