[pj-news-ticker]
Thursday, May 21, 2026

Buy now

మందుల దుకాణాల బంద్ సంపూర్ణం 

మందుల దుకాణాల బంద్ సంపూర్ణం 

 

మద్దతు తెలిపిన మందుల దుకాణదారులు

ఆన్ లైన్ మందుల అమ్మకాలు నిలిపివేయాలి

మంగపేట, మే 20, అక్షర సవాల్:

దేశవ్యాప్తంగా బుధవారం జరుగుతున్న ఆల్ ఇండియా కెమిస్టుల బంద్ నేపథ్యంలో మండల వ్యాప్తంగా మందుల దుకాణాల నిర్వాహకులు  షాపులు మూసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మండలంలోని మందుల దుకాణదారులు మమేకమై బంద్ లో పాల్గొని కమలాపురం నుండి రాజపేట వరకు నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు.  మంగపేట మండల మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బర్ల సంజీవరెడ్డి స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్లో(ఫార్మసీ) మందులు తక్కువ ధరకే అమ్మకాలను వెంటనే నిలిపివేసి విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ బర్ల సంజీవరెడ్డి సెక్రటరీ సామల సాంబశివరావు కోశాధికారి వాలాద్రి శ్రీనివాసరెడ్డి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

 

 

 

 

 

Related Articles

Latest Articles