జూన్ 28 న స్నేహపూర్వక పరుగు పందెం
యువతలో దేశభక్తి, ఆరోగ్య చైతన్యమే లక్ష్యం
పర్వతగిరి,జూన్ 27 అక్షర సవాల్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్–వనితా అచ్చుతా పాయి విద్యాలయ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో “స్వామి వివేకానంద రన్–కల్లెడ” పేరుతో 5 కిలోమీటర్ల స్నేహపూర్వక పరుగు పందెంను రేపు (జూన్ 28, ఆదివారం) నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆడెపు జనార్ధన్ తెలిపారు. ఉదయం 7 గంటలకు కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమయ్యే ఈ పరుగు పందెం,పర్వతగిరిలోని పర్వతాల శివాలయం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. యువతలో ఆరోగ్య చైతన్యం,క్రమశిక్షణ,దేశభక్తి భావం,క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. పరుగు అనంతరం పాల్గొనే వారికి స్నాక్స్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు ముందస్తుగా కింది గూగుల్ ఫారమ్ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చని,అలాగే రేపు ఉదయం కార్యక్రమం ప్రారంభానికి ముందు కళాశాల ప్రాంగణంలోనూ నేరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ లింక్: https://docs.google.com/forms/d/e/1FAIpQLSe23XWrarMT4cTNVtFQGzPbHsC1fX2ofYSyg8_LCRmkDzKSgg/viewform?usp=headerవిద్యార్థులు,యువత,క్రీడాకారులు,గ్రామీణ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రిన్సిపాల్ ఆడెపు జనార్ధన్,పిడి బి. రాజు,5కె రన్ ఇన్చార్జి బిందు కోరారు. మరిన్ని వివరాలకు: 95026 89477,99593 01913 నంబర్లను సంప్రదించండి.

