[pj-news-ticker]
Thursday, April 16, 2026

Buy now

కొమ్మల జాతర తెలంగాణ జాతర 

 

చక్రస్నాన పుష్కరిణిని ప్రారంభిస్తున్న పూజారులు

కొమ్మల జాతర తెలంగాణ జాతర 

చక్రస్నాన పుష్కరిణి ప్రారంభం

గజ, హంస వాహనాల సమకూర్పు

గీసుగొండ, అక్షర సవాల్: గీసుగొండ మండలం కొమ్మల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కొమ్మలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి చక్రస్నానం కోసం నూతనంగా నిర్మించిన చక్రస్నాన పుష్కరిణిని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ వీరటి స్వర్ణ రవీందర్ రెడ్డి దంపతుల సహకారంతో ఈ పుష్కరిణి నిర్మాణం పూర్తి అయ్యింది. వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభోత్సవం చేశారు. భక్తులు భారీగా తరలి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల సహకారంతో స్వామివారికి నూతనంగా గజవాహనం, హంస వాహనం సమకూరాయి. బ్రహ్మోత్సవాల్లో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆలయ పరిసరాలు భక్తిజన సందోహంతో కిటకిటలాడాయి. ఉత్సవాలు శాంతియుతంగా, వైభవంగా కొనసాగేందుకు కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Related Articles

Latest Articles