Trending Now
Saturday, July 27, 2024

Buy now

Trending Now

ఇద్దరు గంజాయి తరలిస్తున్న నిందితుల అరెస్ట్

ఇద్దరు గంజాయి తరలిస్తున్న నిందితుల అరెస్ట్.

నిందితుల నుంచి 7.44 కే‌జి ల ఎండు గంజాయి, 2 సెల్ ఫోన్ లు స్వాధీనం

-భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పి  పుల్లా కరుణాకర్.

భూపాలపల్లి, అక్టోబర్ 6 (అక్షర సవాల్):

గురువారం రోజున (5-10-2023)న సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేరు వేరు ప్రదేశాలలో  5 ఇన్ క్లైన్ మైన్ పరిధిలో మరియు జయశంకర్ పార్క్ దగ్గర గల భారత్ గ్యాస్ గోదాం వద్ద భూపాలపల్లి పోలీసు వారు ఇద్దరు వ్యక్తుల వద్ద మొతం (4.875+2.565=7.44) 7.44 కే‌జి ల ఎండు గంజాయి ని మరియు వారి వద్ద 2 సెల్ ఫోన్ లను స్వాదిన పరుచుకొని . వారి పై సీఆర్.నెం: 1) 458/2023 యు/ఎస్ 8(సీ),ఆర్/డబ్ల్యూ 20(బీ) ఎన్డిపీఎస్  ఆక్ట్  ,2) 459/2023 యు/ఎస్ 8(సీ),ఆర్/డబ్ల్యూ 20(బీ) ఎన్డిపీఎస్ ఆక్ట్ ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది .ఎండు గంజాయి కలిగిన వారి వివరాలు మొదటి వ్యక్తి  కంది సాయి చరణ్ s/o  రవి వయసు 23 సంవత్సరాలు, కులం : మాల, వృత్తి :పెయింటింగ్, నివాసం :సుభాష్ కాలనీ భూపాలపల్లి మరియు రెండవ వ్యక్తి వివరాలు మందల కళ్యాణ్ కుమార్ s/o హరికృష్ణ, వయసు: 22 ,కులం: ముదిరాజ్, వృత్తి: డ్రైవర్, నివాసం: భాస్కర్ గడ్డ భూపాలపల్లి. ఇట్టి ఎండు గంజాయిని వీరిద్దరు సుభాష్ కాలనీ భూపాలపల్లికి చెందిన  తోట పవన్ అనే వ్యక్తి వద్ద కొన్నట్లు విచారణలో తెలిసింది. ఈరోజు కంది సాయి చరణ్ ను మరియు మందల కళ్యాణ్ కుమార్ లను జ్యుడీషియల్ రిమాండుకు తరలిస్తున్నామని ఎస్పి  తెలిపారు. తోట పవన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని, ఇట్టి గంజాయి విలువ మార్కెట్లో మొత్తం దాదాపు 1,86,000/- రూపాయల వరకు ఉంటుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  పుల్లా కరుణాకర్  శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్  గంజాయి నిర్మూలన లక్ష్యంగా గంజాయి పై రైడ్స్ చేయమని ఆదేశించగా అట్టి ఆదేశాల మేరకు భూపాలపల్లి డిఎస్పీ రాములు  ఆద్వర్యంలో ఇట్టి గంజాయి ని భూపాలపల్లి సీఐ రాంనర్సింహారెడ్డి , ఎస్ఐ లు శ్రావణ్ కుమార్, సంధ్యారాణి, స్వప్నకుమారి మరియు వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది . ఈ సందర్బంగా ఎస్పి  మాట్లాడుతూ గంజాయి, ఇతర డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని ప్రజలు, యువత పోలీసులకు తెలపాలని కోరారు.

Related Articles

Latest Articles