Trending Now
Tuesday, October 29, 2024

Buy now

Trending Now

నేడు కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు సీఎం కేసీఆర్

మంచిర్యాల: జూన్ 30(అక్షర సవాల్):

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.00 గంటలకు సిద్దిపేటలోని అగ్రికల్చర్‌ ఫామ్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 12.55 గంటలకు కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకొంటారు. 1.15 గంటలకు కుమ్రం భీం చౌరస్తాకు చేరుకొని, కుమ్రం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పిస్తారు. 1.25 గంటలకు బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 1.50 గంటలకు చిల్డ్రన్‌ పార్క్‌లో కొట్నాక్‌ భీంరావ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పిస్తారు.

2.10 గంటలకు జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 2.30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించి ఉద్యోగులనుద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడే జిల్లాలోని లబ్ధిదారులకు పోడు పట్టాలు అందజేస్తారు. అక్కడే భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5.05 గంటలకు హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణమై 6.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొంటారు. 6.25 గంటలకు ప్రగతి భవన్‌కు వెళ్తారు.

Related Articles

Latest Articles