Monday, May 27, 2024

జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

భూపాలపల్లి , జూలై 13 (అక్షర సవాల్):

జిల్లా కేంద్రంలో నూతనంగా 25 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన  తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ ను , పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని. ఆగస్టు చివరి నాటికి  ముఖ్యమంత్రి  కేసిఆర్  జిల్లా పోలీస్ కార్యాలయం తో పాటు కలెక్టరేట్, మెడికల్ కాలేజ్ ను ప్రారంభించనున్నారని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జె. సురేందర్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అదనపు ఎస్పీ ఏ.ఆర్ వి. శ్రీనివాసులు, భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, మున్సిపల్ చైర్మన్  సేగ్గం వెంకట్రాణి, కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles