Trending Now
Trending Now

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో పోలిసుల పాత్ర కీలకం :ఎస్పి 

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో పోలిసుల పాత్ర కీలకం :ఎస్పి

భూపాలపల్లి, సెప్టెంబర్ 13 (అక్షర సవాల్):

ఎన్నికల నియమావళి పై అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని, ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల నిర్వహణలో పోలీస్ ల పాత్ర చాలా కీలకమైందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్  అన్నారు.

బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రాబోవు రాష్ట్ర శాసనసభ ఎన్నికల నియమావళి, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది తీసుకోవలసిన చర్యలపై ఎస్పి  ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిoచారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ….రాబోయే శాసనసభ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో , పర్యవేక్షణలో క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు.ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఎన్నికలను ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఒకటికి రెండుసార్లు విషయాలు తెలుసుకొని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. పోలీసు అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామాలలో ఎలాంటి సమస్యలు లేకుండా, సమస్యలు సృష్టించే వారినీ బైండోవర్ చేయాలని తెలిపారు. ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో సమస్యలును సృష్టించిన వారి పై పూర్తి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలీస్ అధికారులు ఎలక్షన్ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలను, మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి, దృష్టిసారించాలన్నారు.

ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, కాటారం డిఎస్పీ  జి. రామ్మోహన్ రెడ్డి, జిల్లా పరిధిలోని సీఐ లు, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Latest Articles