పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి అందరూ సహకరించాలి
— కమిటీ ఆధ్వర్యంలో విరాళ పుస్తకాల ఆవిష్కరణ
గణపురం, జూన్ 28 (అక్షర సవాల్): పోచమ్మ తల్లి పునః ప్రతిష్ట ఆలయ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నాగపురి శ్రీనివాస్ గౌడ్, గౌరవ అధ్యక్షులు గణపురం సర్పంచ్ నారగాని దేవేందర్ ఉప సర్పంచ్ పోతర్ల అశోక్ యాదవ్ లు గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
జయశంకర్ జిల్లా గణపురం మండల కేంద్రంలో బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో విరాల పుస్తకాలను ఆవిష్కరించారు. కమిటీ నిర్ణయం మేరకు తొలి ఏకాదశి అనంతరం విరాళాల సేకరణ ప్రారంభించడం జరుగుతుందని కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించారు. ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పున ప్రతిష్టాపన కమిటీ చైర్మన్ నాగపూర్ శ్రీనివాస్ గౌడ్ గౌరవ అధ్యక్షులు ఘనపురం సర్పంచ్ నారగని దేవేందర్ గౌడ్ , ఉప సర్పంచ్ పోతర్లఅశోక్ యాదవ్ మరియు కమిటీ సభ్యులు వడ్ల కొండ నారాయణ గౌడ్ మామిడ్ల మల్లిఖార్జున్ గౌడ్ అంపోజ్వల రవీందర్ రెడ్డి పొతర్ల మల్లికార్జున్ యాదవ్ బత్తిని శివశంకర్ గౌడ్ గంధం ఒధాకర్ చిలుమోజు భాస్కర్ ఆరుమూళ్లఎల్ల స్వామి దూడపాక దుర్గయ్య బొట్ల శ్రీనివాస్ పుప్పాల దీపక్ ముక్కెర సాయిలు గౌడ్ కొయ్యల గౌతమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.