[pj-news-ticker]
Wednesday, April 15, 2026

Buy now

ఎగిసిపడుతున్న బోగత జలపాతం

ఎగిసిపడుతున్న బోగత జలపాతం

వాజేడు జులై 17 అక్షర సవాల్ :

గత రెండు రోజులుగా ములుగు జిల్లా వాజేడు మండలంలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి మండల పరిధిలోని చీకుపల్లి బొగత జలపాతం లోకి అత్యధికంగా వరద నీరు చేరడంతో బోగత జలపాతం ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగి ప్రవహిస్తుంది. జల ధారలు ఎగిసిపడుతూ తుంపర్లను వెదజల్లుతుంది కనువిందు చేస్తున్న బోగత జలపాతం అందాలకు పర్యాటకులు ఫిదా అవుతున్నారు. బోగత జలపాతం అందాలను చూసేందుకు ఆంధ్ర చతిస్గడ్ తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుండి పర్యాటకులు తరలి వస్తున్నారు బొగత అందాలను తిలకిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు దీనితో బోగత జలపాతం ప్రాంగణం జనసంద్రంగా మారింది బొగత జలపాతాన్ని సందర్శించే పర్యాటకులు పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా జలపాతం ప్రదేశానికి చేరుకొని అందాలను వీక్షిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు గత రెండు రోజులుగా కురుస్తున్న వరుస్తాలకు వాగులు వంకలు నిండుగా ప్రవహిస్తున్నాయి దీనితో గోదావరి లోకి వరద నీరు చేరి క్రమేపి పెరుగుతుంది.

Related Articles

Latest Articles