[pj-news-ticker]
Tuesday, April 14, 2026

Buy now

మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల 

మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల 

ఏటూరునాగారం, ఏప్రిల్ 14,అక్షర సవాల్:

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల సిద్ధమైంది. గతంలో ఇక్కడి గుత్తికోయల పిల్లలు సరైన వసతులు లేక పశువుల కొట్టంలోనే విద్యనభ్యసించేవారు.ఈ దుస్థితిపై పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన రాష్ట్ర మంత్రి సీతక్క విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కంటైనర్ పాఠశాలలను ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం ఈ కంటైనర్ పాఠశాల సిద్ధంగా ఉంది. త్వరలోనే మంత్రి సీతక్క చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది. గంటలకుంట, మామిడిగూడెం గ్రామాల నుండి సుమారు 36 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించనున్నారు.

Related Articles

Latest Articles